గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: స్టెప్పులేసిన వీహెచ్, జగ్గారెడ్డి

Published : Jun 02, 2022, 10:31 AM IST
గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: స్టెప్పులేసిన వీహెచ్, జగ్గారెడ్డి

సారాంశం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గిరిజన మహిళలతో కలిసి వి. హనుమంతరావు, జగ్గారెడ్డిలు డ్యాన్సు చేశారు.

హైదరాబాద్: Telangana Formation Day వేడుకలను Gandhi Bhavan లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని గాంధీ భవన్ లో జాతీయ పతాకాన్ని Congressపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ Manickam Tagoreఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు డ్యాన్సులు చేశారు. గాంధీ భవన్ ఎదుట గిరిజన మహిళలతో కలిసి  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత V.Hanumantha Rao డ్యాన్సులు చేశారు. వీహెచ్ డోలు వాయిస్తూ గిరిజన మహిళలతో కలిసి Dance చేశారు. వీహెచ్ డ్యాన్స్ చేయడాన్ని చూసిన జగ్గారెడ్డి కూడా కొద్దిసేపు మహిళలతో కలిసి స్టెప్పులేశారు.
 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu