చిట్టి డబ్బులడిగితే.. కోరిక తీర్చమని వేధించిన గవర్నమెంట్ టీచర్.. కలకలం రేపుతున్న లెటర్స్...

Published : Dec 14, 2022, 01:21 PM IST
చిట్టి డబ్బులడిగితే.. కోరిక తీర్చమని వేధించిన గవర్నమెంట్ టీచర్.. కలకలం రేపుతున్న లెటర్స్...

సారాంశం

తెలిసిన వ్యక్తి అని చిట్టీవేసి.. డబ్బులు అడిగితే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు మెదక్ లోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి మీద ఓ యువతి టీచర్స్ యూనియన్ నేతలకు లేఖలు రాసింది.

మెదక్ : ఓ గవర్నమెంట్ టీచర్ నీచానికి తెగబడ్డాడు. ప్రభుత్వోద్యోగంలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా చిట్టీలు నడపడమే కాకుండా.. తన దగ్గర చిట్టి వేసిన యువతి చిట్టీ డబ్బులు అడిగితే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీరిస్తేనే చిట్టి డబ్బులు ఇస్తానని వేధించాడు. ఈ మేరకు ఆ యువతి ఉపాధ్యాయ సంఘాల నేతలకు  లెటర్స్ రాసింది. ఈ లెటర్స్ మెదక్ లో కలకలం రేపాయి. ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరుకోవడంతో వారు ఈ లేఖల మీద విచారణ చేస్తున్నట్లు సమాచారం... 

లేఖలో ఆ యువతి ఏం రాసింది అంటే.. ‘ మా నాన్న మద్యానికి బానిసయ్యాడు. మా బాగోగులు చూడటం లేదు. మమ్మల్ని అస్సలు పట్టించుకోడు. దీంతో నా జీతంలో నుంచి కొంత డబ్బును పొదుపు చేశాను. టీచర్ తెలిసినవాడే కావడంతో.. చిట్టీలు నడుపుతుండడంతో అతని దగ్గర రూ.2 లక్షలకు చిట్టీ వేశాను. చిట్టీ గడువు ఇరవై ఆరు నెలలు. గడువు తీరిపోయింది. చిట్టి డబ్బులు ఇవ్వలేదు. ఇటీవల నాకు పెళ్లి కుదిరింది. డబ్బులు ఇవ్వమని ఆ టీచర్ ను అడిగాను. 

న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం: పార్టీ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్

మీ నాన్నకు డబ్బులు ఇచ్చేశానని మొదట బుకాయించాడు. ఈమధ్య ఒంటరిగా కలిశాడు. వచ్చేనెల ఎలాగూ పెళ్లి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు.. కాబట్టి ఈ నాలుగు రోజులు నాతో పాటు గడుపు.. అలా చేస్తే.. నీ డబ్బులు మొత్తం నీకు ఇచ్చేస్తా’ అని వేధించాడు. ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నీ క్యారెక్టర్ మంచిది కాదు అని చెబుతాను. పెళ్లి కొడుకుకు, అతని తరఫు వాళ్లకు చెప్పి సంబంధం చెడగొడతాడు. మీ నాన్న సంగతంటావా.. ఓ పది వేలు ఇస్తే అతను కూడా అదే విషయం చెప్తాడు. అప్పుడు పైసలతో పాటు.. పరువు కూడా పోతుంది, పెళ్లి క్యాన్సిల్ అయితుంది’.. అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంటూ ఆ యువతి లేఖలో రాసుకొచ్చింది. అయితే దీని మీద తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సిఐ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
IPS Officer Uday Krishna Reddy Controversy Explained | Harassment Allegations & Viral Letter