అఖిలేష్ యాదవ్, కుమారస్వామిలతో కేసీఆర్ భేటీ: దేశ రాజకీయాలపై చర్చ

By narsimha lode  |  First Published Dec 14, 2022, 12:20 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో  సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్,  జేడీఎస్ నేత  కుమారస్వామిలు  ఇవాళ  సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే  కేసీఆర్ వీరిద్దరితో భేటీ అయ్యారు.


న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ తో  సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్,  కర్ణాటక మాజీ సీఎం   కుమారస్వామిలు  న్యూఢిల్లీలో బుధవారంనాడు భేటీ అయ్యారు. దేశ రాజకీయ పరిస్థితులపై  కేసీఆర్  ఈ ఇద్దరు నేతలతో కేసీఆర్ చర్చించారు. సుమారు గంటకుపైగా  కేసీఆర్ ఈ ఇద్దరు నేతలతో చర్చించారు.  దేశంలో  బీజేపీని నిలువరించేందుకు  అవలంభించాల్సిన  వ్యూహంపై  కేసీఆర్  ఈ ఇద్దరు నేతలతో చర్చించారు. గతంలో కూడా   సమాజ్ వాదీ పార్టీ చీఫ్  అఖిలేష్ యాదవ్ , కుమారస్వామితో  కేసీఆర్  పలు దఫాలు చర్చించిన విషయం తెలిసిందే. ఇవాళ బీఆర్ఎస్  కార్యాలయం  ప్రారంభోత్సవానికి  కేసీఆర్ ఈ ఇద్దరు నేతలను ఆహ్వానించారు.  ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి  ముందే  తన నివాసంలో ఈ ఇద్దరు నేతలతో కేసీఆర్  చర్చించారు. ఈ సమావేశం  ముగిసిన  తర్వాత  సర్ధార్ పటేల్ రోడ్డులో ఉన్న బీఆర్ఎస్ తాత్కాలిక భవనానికి  కేసీఆర్ చేరుకున్నారు. తన కారులోనే  అఖిలేష్ యాదవ్,  కుమారస్వామిలను కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయానికి తీసుకు వచ్చారు. 

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని  నిన్న  ఉదయం నుండి  ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజ శ్యామల యాగాన్ని  కూడా చేస్తున్నారు.  ఈ పూజలను పురస్కరించుకొని  వేద పండితుల ఆశీర్వచనాలను  కేసీఆర్ తో పాటు  అఖిలేష్ యాదవ్,  కుమారస్వామిలు తీసుకున్నారు. 

Latest Videos

బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి  పలు రాష్ట్రాలకు చెందిన నేతలకు  కేసీఆర్ ఆహ్వానం పంపారు.  ఇవాళ మంచి ముహుర్తం  ఉన్నందున  బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా  మార్చారు.ఈ మేరకు ఈ ఏడాది అక్టోబర్  5వ తేదీన  తీర్మానం చేసింది ఆ పార్టీ.ఈ తీర్మానం కాపీనీ ఈసికి పంపారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఈసీ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు  ఈసీ నుండి కేసీఆర్ కు లేఖ అందింది.  ఈ నెల 9వ తేదీన  ఈసీ పంపిన లేఖపై కేసీఆర్  సంతకం చేసి తిరిగి ఈసీకి పంపారు. 

also read:నేడే న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం: చేరుకున్న కేసీఆర్ సతీమణి శోభ

దేశ వ్యాప్తంగా  పార్టీని విస్తరించడానికి వీలుగా  టీఆర్ఎస్  పేరును మార్చారు కేసీఆర్.  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  పార్టీని  విస్తరించేందుకు  కేసీఆర్  ప్లాన్ చేస్తున్నారు.2024 లో జరిగే  ఎన్నికల్లో కేంద్రంలో  బీజేపీని అధికారంలోకి రాకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో  బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో  కేసీఆర్ ఇప్పటికే  చర్చలు జరిపారు.  
 

click me!