థర్ద్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్దం: కరోనాపై హైకోర్టుకు కేసీఆర్ సర్కార్ నివేదిక

By narsimha lodeFirst Published Jun 1, 2021, 12:32 PM IST
Highlights

నిబంధనలు పాటించని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు 10 ఆసుపత్రులకు కోవిడ్ ట్రీట్ మెంట్ లైసెన్సులను కూడ రద్దు చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరో వైపు థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కూడ సిద్దంగా ఉన్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

హైదరాబాద్: నిబంధనలు పాటించని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు 10 ఆసుపత్రులకు కోవిడ్ ట్రీట్ మెంట్ లైసెన్సులను కూడ రద్దు చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరో వైపు థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కూడ సిద్దంగా ఉన్నట్టుగా ప్రభుత్వం వివరించింది.తెలంగాణలో కరోనా కేసులపై హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ సమగ్ర నివేదికను అందించింది.  కరోనా సమయంలో  నమోదు చేసిన కేసుల వివరాలను కూడ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు అందించారు. వైద్య ఆరోగ్యశాఖ, డీజీపీ వేర్వేరుగా నివేదికలను కోర్టుకు అందించారు.

also read:అధిక ఫీజులు: తెలంగాణలో ఆరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ అనుమతులు రద్దు

రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని హైకోర్టుకు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్ 29న లక్ష మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపింది. నిబంధనలు పాటించని 10 ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేశామని ప్రకటించింది.  నిబంధనలు పాటించని 115 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని తెలిపింది., మరో 10 ఆసుపత్రుల అనుమతులు కూడ రద్దు చేసినట్టుగా వివరించింది. రాష్ట్రంలో 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కోర్టుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వివరించింది.కరోనా మందుల  బ్లాక్ మార్కెట్ పై 150 కేసులు నమోదు చేసినట్టుగా  డీజీపీ హైకోర్టుకు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులతో పాటు రూ. 35.81 కోట్ల జరిమానాను విధించినట్టుగా ఆయన చెప్పారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 2.61 లక్షల మందిపై కేసులు నమోదు చేసినట్టుగా ఆయన హైకోర్టు దష్టికి తీసుకొచ్చారు. 
 

click me!