శంషాబాద్ లో రూ. 34 లక్షల విలువైన బంగారం పట్టివేత...

By AN TeluguFirst Published Jun 1, 2021, 11:56 AM IST
Highlights

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మరోసారి భారీ స్తాయిలో బంగారు పట్టుబడింది. కువైట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. 

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మరోసారి భారీ స్తాయిలో బంగారు పట్టుబడింది. కువైట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. 

ఓ కేటుగాడు 34 లక్షల విలువ చేసే 24 caratల బంగారాన్ని గొలుసుల రూపంలో తీసుకువచ్చాడు. గొలుసుల రూపంలో వున్న బంగారాన్ని తను వేసుకున్న ప్యాంట్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జేబులో దాచి తరలించే యత్నం చేశాడు.
 
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల‌ తనిఖీలలో ఈ విషయం బయట పడింది. ఇదంతా విదేశీ బంగారం కావడంతో వారు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

బంగారం సీజ్ ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆ వ్యక్తి మీద కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
click me!