బీఈడీ ఎంట్రెన్స్, ఆడ్మిషన్లలో మార్పులు: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు

By narsimha lodeFirst Published Apr 12, 2021, 4:15 PM IST
Highlights

తెలంగాణలో బీఈడీ ఎంట్రెన్స్, ఆడ్మిషన్స్ రూల్స్ లో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణలో బీఈడీ ఎంట్రెన్స్, ఆడ్మిషన్స్ రూల్స్ లో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ ఉన్నత విద్యా మండలి సిఫారసుల మేరకు ఈ సవరణలు చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొంది. 

అన్ని సబ్జెక్టుల వారికి కామన్ ఎంట్రెన్స్ ఉంటుంది. ర్యాంక్, డిగ్రీలో అభ్యర్ధులు తీసుకొన్న కోర్సును బట్టి సీట్ల కేటాయించనున్నారు. డిగ్రీలో బీబీఏ, బీసీఏ, బీబీఎం, ఇంజనీరింగ్ చేసినవారికి కూడ బీఎడ్ చేసే అవకాశం కల్పించనున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.మ్యాథ్స్, మెథడాలజీకి 25 శాతం సీట్లు కేటాయించారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ విద్యార్ధులకు 30 శాతం సీట్లు అలాట్ చేశారు. పోషల్ సైన్స్ విద్యార్ధులకు 45 శాతం సీట్లు దక్కనున్నాయి.

అన్ని సబ్జెక్టులు చదువుకొన్నవారు బీఈడీ చేసుకొనే వెసులుబాటును కల్పించేందుకు గాను ఉన్నత విద్యామండలి ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. 


 

click me!