తమిళనాడులో ముగిసిన ఎన్నికలు: తెలంగాణకు రేపు కాంగ్రెస్ ఇంచార్జీ మాణికం ఠాగూర్

Published : Apr 12, 2021, 03:13 PM IST
తమిళనాడులో ముగిసిన ఎన్నికలు: తెలంగాణకు రేపు కాంగ్రెస్ ఇంచార్జీ మాణికం ఠాగూర్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఈ నెల 13న హైద్రాబాద్ కు రానున్నారు. ఈ నెల 14న ఆయన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఈ నెల 13న హైద్రాబాద్ కు రానున్నారు. ఈ నెల 14న ఆయన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాణికం ఠాగూర్ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణ వ్యవహరాలకు ఇంతకాలం పాటు దూరంగా ఉన్నారు.ఈ నెల 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. 

దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మాణికం ఠాగూర్ ఈ నెల 13న తెలంగాణకు రానున్నారు. ఈ నెల 13న ఆయన హైద్రాబాద్ చేరుకొంటారు. పార్టీ నేతలతో ఎన్నికల విషయమై చర్చిస్తారు. ఈ నెల 14న సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ఈ నెల 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉన్నారు.టీఆర్ఎస్ నుండి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్, బీజేపీ నుండి డాక్టర్ రవికుమార్ నాయక్ పోటీ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu