ఉద్రిక్తత : ఫారెస్ట్ ఆఫీసర్ లను కొట్టి, చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. (వీడియో)

By AN TeluguFirst Published Apr 12, 2021, 4:01 PM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళిన అధికారులను గ్రామస్తులు చెట్టుకు కట్టేశారు. ఆ వివరాలు దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

"

 ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా పోడు భూమి లోకి మీరు ఎలా వస్తారని అధికారులను అడ్డుకోవడమే కాక వారిని కొట్టి చెట్టుకు కట్టేశారు.

అయితే అధికారులు మాత్రం తాము సర్వేకు మాత్రమే వెళ్లామని, గ్రామస్తులు భూములు స్వాధీనం చేసుకుంటామని అనుమానించారని తెలిపారు. అయితే తాము స్వాధీనం కోసం రాలేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదని వారు అంటున్నారు.

ముగ్గురు అధికారులను ఇలా చెట్టుకు కట్టేసి చితకబాదారు. అయితే ఈ ఘటనమీద ఫారెస్ట్ అధికారులు సీరియస్ అయ్యారు. దాడికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని వారు తెలుపుతున్నారు. 
 
click me!