నాతో పాటు కేటీఆర్ సినిమాకు రావాలి - గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

Published : Sep 19, 2023, 01:56 PM IST
 నాతో పాటు కేటీఆర్ సినిమాకు రావాలి - గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

సారాంశం

తనతో పాటు మంత్రి కేటీఆర్ సినిమాకు రావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రాజాకార్ల గురించి, నిజాం పాలన గురించి మంత్రి కేటీఆర్ కు తెలియదని చెప్పారు. అందుకే తన వెంట రాజాకార్స్ ఫైల్స్ సినిమాకు రావాలని కోరారు.

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేటీఆర్ సినిమాకు ఆహ్వానించారు. బీజేపీ నాయకులు జోకర్లు కాదని అన్నారు. వారంతా హీరోలు అని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు నిజాం పాలన ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. తన పాటు రాజాకార్స్ ఫైల్స్ సినిమా చూసేందుకు రావాలని, అప్పుడు తెలుస్తుందని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రధానికి పదేళ్లు ఎందుకు పట్టింది - రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్

మీర్ ఉస్బాన్ అలీ ఖాన్ ఆరాచకాలు ఏంటో సీఎం కేసీఆర్ ను అడిగి మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు. ముందుగా రాజకార్ ఫైల్స్ సినిమాను కేటీఆర్ చూడాలని అన్నారు. తరువాతే తనతో మాట్లాడాలని చెప్పారు. బీజేపీ లీడర్లు అంతా హీరో అని తెలిపారు. 

ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడికి ఎస్ఐ ప్రయత్నం.. బట్టలూడదీసి, స్తంభానికి కట్టేసి, చితకబాదిన గ్రామస్తులు

ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేశారు.  పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని.. అర్హులకు కాకుండా అనర్హులు, బీఆర్ఎస్‌కు సంబంధించిన వారికే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తమాషాలు చేస్తున్నారని విమర్శించారు.

కెనడా పార్లమెంట్ లో హర్దీప్ సింగ్ ప్రస్తావన.. ఇంతకీ ఎవరీయన.. భారత్ కు ఉన్న సంబంధమేంటి?

తన నియోజకవర్గంలోనూ అర్హత లేని వారికి ఇళ్లు ఇచ్చారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ ఇళ్లను పీఎంఏవై కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని ఆయన తెలిపారు. కానీ వీటిని తామే నిర్మించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ మత్తుల తెలంగాణగా మారిందన్నారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని రాజాసింగ్ సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?