గన్ లైసెన్స్ ఇవ్వండి: బెదిరింపు ఫోన్లపై డీజీపీకి రాజాసింగ్ లేఖ

By narsimha lode  |  First Published Mar 21, 2023, 10:14 AM IST

గోషామహల్  ఎమ్మెల్యే  రాజాసింగ్  కు   మరోసారి బెదిరింపు  ఫోన్లు  వచ్చాయి. ఈ విషయమై  రాజాసింగ్  తెలంగాణ డీజీపీకి  లేఖ రాశారు.  


హైదరాబాద్: పాకిస్తాన్ కు చెందిన  ఎనిమిది  నెంబర్ల నుండి  తనకు  బెదిరింపు ఫోన్లు  వస్తున్నాయని  గోషామహల్  ఎమ్మెల్యే  రాజాసింగ్  చెప్పారు.   ఈ విషయమై  తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు   రాజాసింగ్  మంగళవారంనాడు  లేఖ రాశారు. 

తనకు  పాకిస్తాన్  నుండి  బెదిరింపు కాల్స్  వస్తున్నాయని  పోలీసులకు  ఫిర్యాదు  చేసినా  పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆ లేఖలో  ఆరోపించారు.  జైశ్రీరామ్ అన్న ప్రతిసారీ పోలీసులు  ఎఫ్ఐఆర్ బుక్ చేశారని  రాజాసింగ్  గుర్తు  చేశారు..  తనకు బెదిరింపు  ఫోన్ కాల్స్  విషయమై  ఫిర్యాదు  చేసినా  కూడా  కేసు ఎందుకు  నమోదు చేయలేదని  రాజాసింగ్  ప్రశ్నించారు.     తనకు  గన్ లైసెన్స్ ఇవ్వాలని  అభ్యర్ధించినా  ఇంతవరకు  గన్ లైసెన్స్ ఇవ్వలేదని రాజాసింగ్   చెప్పారు.  తనపై కేసులున్నాయనే  కారణంగా గన్ లైసెన్స్  ఇవ్వని  విషయాన్ని  రాజాసింగ్ ఆ లేఖలో  ప్రస్తావించారు. కేసులున్నవారికి  కూడా  గన్ లైసెన్స్ లు  ఇచ్చిన విషయాన్ని  రాజాసింగ్  ఆ లేఖలో  ప్రస్తావించారు.తనకు  ప్రాణహాని  ఉందన్నారు.  తనకు  గన్  లైసెన్స్  ఇవ్వాలని  రాజాసింగ్  కోరారు.  

Latest Videos

ఈ  ఏడాది ఫిబ్రవరి  20వ తేదీన  రాజాసింగ్  కు  బెదిరింపు  ఫోన్ కాల్స్  వచ్చాయి.  చంపేస్తామని  ఆగంతకులు  బెదిరించారని రాజాసింగ్  చెప్పారు. ఈ విషయమై  రాజాసింగ్  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. ఈ ఘటన  జరిగిన  తర్వాత  కూడా  రాజాసింగ్ కు  బెదిరింపు  ఫోన్ కాల్స్  వచ్చాయి.   తాజాగా  మరోసారి  బెదిరింపులు  వచ్చినట్టుగా  రాజాసింగ్  తెలిపారు.  తనకు  పాకిస్తాన్ కు  చెందిన  ఎనిమిది  ఫోన్ నెంబర్ల నుండి   బెదిరింపులు  వచ్చాయని రాజాసింగ్  డీజీపీకి రాసిన లేఖలో  పేర్కొన్నారు.
 

click me!