సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ బయట బస్సుల ధ్వంసం.. గోపాలపురం పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు..

Published : Jun 20, 2022, 11:06 AM IST
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ బయట బస్సుల ధ్వంసం.. గోపాలపురం పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు..

సారాంశం

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే సికింద్రాబాద్‌ అల్లర్లకు సంబందించి గోపాలపురం పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. 

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే సికింద్రాబాద్‌ అల్లర్లకు సంబందించి గోపాలపురం పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కొందరు ఆందోళనకారులు  రైల్వే స్టేషన్‌ బయట బస్సులను ధ్వంసం చేయడంతో.. పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు.. రైల్వే స్టేషన్​లో ప్రవేశించడానికి ముందు కొందరు ఆందోళనకారులు స్టేషన్ బయట ఉన్న బస్సులను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి బస్సు డ్రైవర్లు గోపాలపురం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దీంతో బస్సులపై దాడికి సంబంధించి గోపాలపురం పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. 143, 341,186, 427, 149 ఐపీసీ పబ్లిక్ ప్రాపర్టీ 3 యాక్ట్ కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా బస్సులపై దాడికి పాల్పడిన ఆందోళనకారులను గుర్తించి.. అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. 

ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (secunderabad railway station) చోటు చేసుకున్న విధ్వంసంపై రైల్వే ఎస్పీ అనురాధ (railway sp anuradha) స్పందించారు. ఆదివారం మీడియా ముందుకు వచ్చిన ఆమె మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన 46 మందిని ఆధారాలతో సహా అరెస్ట్ చేశామన్నారు. రెండు వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. కోచింగ్ సెంటర్లు ఆర్మీ ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టాయని.. సదరు కోచింగ్ సెంటర్లను గుర్తించామని అనురాధ తెలిపారు. 

వీరందరికీ రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం వుందని ఆమె వెల్లడించారు. అలాగే యువకులను రెచ్చగొట్టిన వాట్సాప్ గ్రూప్‌లను కూడా గుర్తించామని అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని ఎలా దాడి చేయాలో చర్చించుకున్నారని ఆమె పేర్కొన్నారు. పోలీసులు, ప్రయాణీకులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని అనురాధ తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లంతా తెలంగాణ వాళ్లేనని... ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. 

ఈస్ట్ కోస్ట్, దనాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వాళ్లు వచ్చారని అనూరాధ తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసుందేరకు ఆర్పీఎఫ్ వాళ్లు కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. 17న ఉదయం 8 గంటలకు 300 మంది స్టేషన్‌లోకి చొరబడ్డారని అనూరాధ తెలిపారు. రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం వుందన్నారు. ఘటనలో 9 మంది రైల్వే సిబ్బంది గాయపడ్డారని.. నిందితుల్ని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఒక కోచ్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టారని.. పదుల సంఖ్యలో కోచ్‌లు ధ్వంసమయ్యాయని అనూరాధ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu