
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మూడంతస్తుల భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.