గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్.. సెల్ఫ్ లాక్ డౌన్ లో గూడెం గ్రామం..

By SumaBala BukkaFirst Published Dec 23, 2021, 10:15 AM IST
Highlights

గూడెం గ్రామానికి 26 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈ నెల 16న అతడు తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా తేలింది. అతని కుటుంబ సభ్యులతో పాటు మరో 64 షాంపిల్లను వైద్యాధికారులు సేకరించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లికి, భార్యకు కోవిడ్ పాజిటివ్ రాగా గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం చేసింది. 

రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో రోజురోజుకు Omicron cases పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే Rajanna Sirisilla, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గల్ఫ్ నుండి వచ్చిన వ్యక్తికి మూడు రోజుల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయ్యింది. కాగా అతని కుటుంబ సభ్యులతో పాటు మరో 64 షాంపిల్లను వైద్యాధికారులు సేకరించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లికి, భార్యకు కోవిడ్ పాజిటివ్ రాగా గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం చేసింది. 

కాగా, ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతూ Omicron variant ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కూడా క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా డిసెంబర్ 21న Rajanna Sircilla districtలో తొలి Omicron కేసు నమోదైంది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్టుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు తెలిపారు. అతను ఇటీవల దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చినట్టుగా చెప్పారు. 

తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా 14 కేసులు, 38కి చేరిన బాధితుల సంఖ్య

వివరాలు.. గూడెం గ్రామానికి 26 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈ నెల 16న అతడు తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతడు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోకి చేరుకున్నాక అధికారులు ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. సోమవారం అతనికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా తేలింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు సోమవారం సమాచారం అందింది. 

దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావుతో పాటు పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సంజీవరెడ్డి.. ఇతర వైద్య సిబ్బంది వెంటనే గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంటనే వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోకి KIMS Hospitalకి తరలించారు. 

Omicron in Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు.. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి నిర్దారణ

సిరిసిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు వైద్యాధికారులు.. ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఇంటికి చేరాక ఎవరెవరిని కలిశారో ఆరా తీశారు. మొదట ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్‌ చేశారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో పాటుగా దుబాయ్ నుంచి వచ్చిన చిప్పలపల్లికి చెందిన మరో వ్యక్తి ఇంటిని కూడా క్వారంటైన్‌ చేశారు. గూడెం గ్రామ ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఇక, తాజా కేసుతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. 

కాగా, తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం నాడు మరో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకున్నాయి. ఈ 14 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 

click me!