సింగరేణి కార్మికులకు శుభవార్త

Published : Sep 20, 2017, 05:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సింగరేణి కార్మికులకు శుభవార్త

సారాంశం

దసరాకు అడ్వాన్స్ 7వేలు పెంపు (గతం కంటే) దీపావళి బోనస్ 3వేలు పెంపు (గతం కంటే) గతం కంటే పెంచిన సర్కార్ ప్రకటించిన ఎండి శ్రీధర్

తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులకు శుభవార్త ప్రకటించింది. కార్మికులకు ఈ ఏడాది పండగ బొనస్ ను పెంచింది ప్రభుత్వం.

సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ , దీపావళి బోనస్ ల క్రింద మొత్తం 82 వేల రూపాయలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ రెండింటికి కలిసి  456 కోట్ల రూపాయలు తమ సంస్థ చెల్లించనుందని సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.

దీపావళి బోనస్ ను గతేడాదితో పోలిస్తే 3 వేల రూపాయలు పెంచి 57 వేలు చేశామన్నారు. అలాగే దసరా అడ్వాన్స్ ను 18 వేల నుండి 25 వేలకు పెంచామని శ్రీధర్ తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం  ఈ నెల 22 వ తేదీన దసరా అడ్వాన్స్ 25 వేలను , దీపావళి బోనస్ ను అక్టోబర్ 2 వ తేదీన 57 వేలను సింగరేణి ఉద్యోగుల బ్యాంక్ ఎకౌంట్లలో జమచేస్తామని ఆయన తెలిపారు.

అయితే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఈ బోనస్ పెంపు శుభవార్త కార్మికులకు అందడం చర్చనీయాంశమైంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?