కూలిన కాళేశ్వరం సొరంగం... ఏడుగురు మృతి

Published : Sep 20, 2017, 04:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కూలిన కాళేశ్వరం సొరంగం... ఏడుగురు మృతి

సారాంశం

కాళేశ్వరం పనులు చేస్తుండగా ప్రమాదం కూలిన మట్టి పెల్లలు ఏడుగురు కార్మికులు మృతి  

కాళేలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతుండగా హటాత్తుగా ప్రమాదం నెలకొంది.

ప్రాజెక్టు పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం, తిప్పాపూర్ వద్ద సొరంగంలో మట్టి పెల్లలు కూలిపోయాయి.

ప్రాజెక్టు పరిధిలోని 10 వ ప్యాకేజీలో నిర్మిస్తున్న టన్నేల్ పనుల వద్ద హెయిర్ బ్లాస్టింగ్ తో టన్నెల్ కూలింది.                       

ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు మరణించారు.

మరణించిన వారిలో ఐదుగురు కూలీలు ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారిగా చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి విచారణ జరుపుతున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

PREV
click me!

Recommended Stories

Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు