
తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌లో కొందరు ఎమ్మెల్యేలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మహిళా కార్పొరేటర్‌ను లైంగికంగా వేధించాడనే వార్తలు కలకలం రేపుతున్నాయి. వివరాలు.. మహిళా కార్పొరేటర్‌కు అర్దరాత్రి వేళ ఫోన్ కాల్స్ చేస్తున్న ఎమ్మెల్యే లవర్ బాయ్ డైలాగ్‌లతో వేధింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. తిన్నావా.. లేదా? ఈ రాత్రి వరకు ఏం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది? అంటూ మాటలు కలిసి అసభ్యంగా ప్రవర్తించినట్టుగా సమాచారం.
ఈ వ్యవహారంపై సదురు మహిళా కార్పొరేటర్.. బీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే రాత్రిపూట ఫోన్ చేసిన సమయంలో ముందు జాగ్రత్తగా తన ఫోన్లో ఆ సంభాషణను రికార్డు చేసిన మహిళా కార్పొరేటర్.. దానిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయం బయటకు పోనివ్వకుండా చూడాలని.. ఆ ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ అధినాయకత్వం ఆమెకు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై బీఆర్ఎస్ వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకుండా పోయింది. కాగా, ఇది మొత్తం తనపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నం అని సదురు ఎమ్మెల్యే తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టుగా ప్రచారం సాగుతుంది.