బయో డేటా కాదు బ్యాలన్స్ షీట్ చూసే టికెట్లు...ఇదీ కేసీఆర్ రాజకీయం..: గోనె ప్రకాష్ రావు

By Arun Kumar PFirst Published Dec 9, 2021, 5:50 PM IST
Highlights

 ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలన తెలంగాణలో కొనసాగుతోందని మాజీ ఆర్టిసి ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మూసీ నదిలో కలిపేసిందని వ్యాఖ్యానించారు. 

కరీంనగర్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (gone prakash rao) పేర్కొన్నారు. ఈ ఏడున్నర సంవత్సరాల టీఆర్ఎస్ (TRS) పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. డబ్బును, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని (Democracy)  అపహాస్యం చేస్తున్నారని గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. 

శుక్రవారం స్థానిక సంస్థల (local body) కోటా ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ (Karimnagar) లో ఓటుహక్కు కలిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ (ravinder singh) కు ఓటేసి గెలిపించాలని ప్రకాష్ రావు కోరారు. అన్ని పార్టీల ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు రవీందర్ సింగ్ కు వేసి టీఆర్ఎస్ బుద్దిచెప్పాలని వేడుకున్నారు. 

Video

''కేసీఆర్ వైఖరి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు బయో డేటాను చూసి టిక్కెట్లు ఇవ్వకుండా బ్యాలెన్స్ షీట్ చూసి టిక్కెట్లు ఇచ్చేలా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల టిక్కెట్లు ఇచ్చే ముందు ఎన్ని బూతులు వచ్చో, ఎన్ని సవాళ్లు చేయగలరో చూసి టిక్కెట్టు ఇచ్చే సరిస్థితి నెలకొంది'' అని ఆరోపించారు.  

read more  కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు...: గోనె ప్రకాష్ రావు సంచలనం (video)

''స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని మూసీ నది (musi river)లో కలిపేసింది. ఈ ఎన్నికల్లో నామినేషన్లు మొదలు అడుగడుగునా టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఏకగ్రీవాల కోసం కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేసింది'' అని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు హుజూరాబాద్ (huzurabad), దుబ్బాక (dubbaka), నాగార్జున సాగర్ (nagarjunasagar), పట్టభద్రుల ఎమ్మెల్సీ (graduate mlc) ఎన్నికల్లో టీఆర్ఎస్ వందలకోట్ల రూపాయలను వెదజల్లింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న డబ్బుపై నిఘా సంస్థలు, ఈడీ వంటివి దర్యాప్తు జరపాలి'' అని డిమాండ్ చేసారు. 

''తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ 'ఓటుకు నోటు' (vote for note), డబ్బు రాజకీయాలను అడ్డుకోవడానికి ఉద్యమం చేయాలి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అవలంబిస్తున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Central election commission), రాష్ట్ర ఎన్నికల సంఘానిక, ఈడీ (ED), ఇతర సంస్థలను కలిసి ఫిర్యాదు చేయాలి. వీటిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు, రాజకీయ పార్టీలు ముందుకు రావాలి'' అని ప్రకాష్ రావు సూచించారు. 

read more  Revanth Reddy: ఆ రెండు పార్టీలు రాజ‌కీయంగా కుమ్మక్కయ్యాయి - రేవంత్ రెడ్డి.

''టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల్లో చేస్తున్న ఖర్చుపై మేధావులు వ్యాసాలు, మీటింగ్లు పెట్టి టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు టీఆర్ఎస్ పార్టీ ధనస్వామ్యాన్ని, దౌర్జన్యస్వామ్యాన్ని అడ్డుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు రావాలి'' అని గోనె ప్రకాష్ రావు సూచించారు. 


 

click me!