
పెద్దపెల్లి (pedda palli district) జిల్లా రామగిరి మండలం (ramagiri) పన్నూరు గ్రామ పంచాయితీ పరిధిలో ఓసీపీ 2 బొగ్గు ఉపరితల గనికి వెళ్లే మార్గంలో ఉన్న ఓ బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఈ సంఘటన జరిగి సుమారు మూడు నాలుగు రోజులు అవుతుందని, అతని వయసు 35 నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన మాత్రం కలకలం రేపింది.