హైదరాబాద్ లలిత జ్యువెలర్స్ లో చోరీ

By telugu teamFirst Published Jan 22, 2020, 8:39 AM IST
Highlights

ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4గంటలకు కొందరు కొనుగోలుదారులు గుంపులు గుంపులుగా వచ్చారు. నగలు చూపించాలని సిబ్బందిని కంగారు పెట్టించి.. వారిని తికమకకు గురిచేసి..  రూ.3.5లక్షల విలువచేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్ లెట్ చోరీ చేశారు.
 

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న ప్రముఖ ఆభరణాల దుకాణం లలితా జ్యెవలర్స్ లో దొంగతనం జరిగింది.  దుకాణ సిబ్బంది దృష్టి మళ్లించి దొంగలు 92గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సంస్థ మేనేజర్ ఫిర్యాదుు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా... ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4గంటలకు కొందరు కొనుగోలుదారులు గుంపులు గుంపులుగా వచ్చారు. నగలు చూపించాలని సిబ్బందిని కంగారు పెట్టించి.. వారిని తికమకకు గురిచేసి..  రూ.3.5లక్షల విలువచేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్ లెట్ చోరీ చేశారు.

Also Read రైలులో పరిచయం... ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..

చోరీ చేసిన విషయం అప్పటికప్పుడు వాళ్లు గుర్తించకపోవడం గమనార్హం. తర్వాత ఆడిట్ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. సీసీ కెమేరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలో ఎవరో నగలను కొట్టేసినట్లు గుర్తించారు. పోలీసులకు మేనేజర్ కె. హరిసుందర్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

కాగా... గతేడాది తమిళనాడులోని తలితా జ్యూవెలర్స్ లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.3కోట్ల విలువైన బంగారు నగలను చోరీ చేశారు. కాగా.. నిందితులను మాత్రం పోలీసులు చాలా తెలివిగా పట్టుకున్నారు. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ లో ఇలా మరో ఘటన చోటుచేసుకుంది.

click me!