తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం

By narsimha lode  |  First Published Jan 22, 2020, 7:06 AM IST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు బుధవారం నాడు ప్రాారంభమయ్యాయి


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని 2,971 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే 83 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇవాళ 12,926 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

Latest Videos

undefined

Also read@పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్‌కు ఇవే చివరి ఎన్నికలు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గాను 55 వేల మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.  మున్సిపాలిటీల్లో సుమారు 11,099 మంది అభ్య ర్థులు పోటీ చేస్తున్నారు. కార్పోరేషన్లలో 1746 మంది బరిలో నిలిచారు. 

మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల 50 వేల 255 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని సుమారు 50  వేలకు పైగా మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేశారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది.

ఈ నెల 25వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. మున్సిపాలిటీల్లో విజయం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ శక్తియుక్తులను ప్రదర్శించాయి.

click me!