బంగారం... వెండి.. పోటీపడి

First Published Dec 16, 2016, 12:44 PM IST
Highlights
  • భారీగా తగ్గుతున్న ధరలు
  • అమెరికా ఫెడరల్ ఎఫెక్టు
  • నోట్ల రద్దూ కారణమే..

బంగారం, వెండి కొనాలనుకునేవాళ్లు త్వరపడండి. ఈ రెండు ఒకదానిని మించి మరొకటి పోటీ పడి తగ్గుతున్నాయి.

 

యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడం, దేశీయంగా ఇన్వెస్టర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగడం తదితర కారణాలతో గురువారం వీటి ధర బాగా తగ్గింది.

 

 

ముంబై బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర 1,410 రూపాయలు తగ్గి 41,00 రూపాయల దిగువకు చేరింది.

 

99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు తగ్గి 28,050 రూపాయల నుంచి రూ. 27,500 లకు చేరింది.

 

కాగా, రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

click me!