తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు: ప్రారంభమైన గోదావరి రివర్ బోర్డు మీటింగ్

By narsimha lodeFirst Published Jun 5, 2020, 11:52 AM IST
Highlights

గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.


హైదరాబాద్: గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.గురువారం నాడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే.  

కాళేశ్వరం, సీతారామ్ ప్రాజెక్టుతుపాకుల గూడెం, లోయర్ పెన్ గంగాతో పాటు రామప్ప నుండి పాకాల వరకు నీటి తరలింపు విషయమై తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

also read:వాడీ వేడీగా కృష్ణా రివర్ బోర్డు మీటింగ్: పోతిరెడ్డిపాడును వ్యతిరేకించిన తెలంగాణ, పాలమూరుపై ఏపీ అభ్యంతరం

కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ కూడ ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఉన్నాయని కూడ తెలంగాణ వాదిస్తోంది. అయితే ఈ వాదనతో ఏపీ ప్రభుత్వం ఏకీభవించడం లేదు.ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను తమ అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్ చేసి ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 

తమ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం ఈ సమావేశంలో వ్యక్తం చేయనుంది. మరో వైపు ఏపీ నుండి తమకు రావాల్సిన నీటి వాటా విషయంలో తెలంగాణ కూడ ఈ సమావేశంలో ప్రస్తావించనుంది.

గోదావరి బోర్డుకు నిధుల కేటాయింపు విషయమై కూడ ఈ సమావేశంలో చర్చ జరగనుంది.ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్  అధికారులు పాల్గొన్నారు.


 

click me!