ఆ నియామకాల్లో మా వాటా మాకియ్యాల్సిందే

Published : Jun 18, 2017, 08:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఆ నియామకాల్లో మా వాటా మాకియ్యాల్సిందే

సారాంశం

రాష్ట్ర విభజన జరిగినా న్యాయ వ్యవస్థ విభజన జరగకపోవడంతో రెండు  రాష్ట్రాల మధ్య వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి హైకోర్టు విభజన జరగాలని తెలంగాణ సర్కారు ఎప్పటి నుంచో కోరుతున్నది. కానీ కేంద్రం ఈ విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. మరోవైపు ఎపి సర్కారు తెలంగాణ సర్కారు మాదిరిగా న్యాయ వ్యవస్థ విభజనకు ముందుకు రావడంలేదన్న విమర్శలున్నాయి.

హైకోర్టు విభజన కోసం గత మూడేళ్లుగా తెలంగాణ సర్కారు కేంద్రంపై పలు రకాలుగా వత్తిడి తెస్తోంది. న్యాయవాదులు సైతం గట్టిగానే పోరాడుతున్నారు. కానీ కేంద్రం పాజిటీవ్ గా స్పందించడంలేదు. దీంతో హైకోర్టు విభజన జరిగేలోగా న్యాయాధికారుల నియామకాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం పట్టుపడుతోంది సర్కారు.

 

తాజాగా తెలంగాణ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్రానికి విన్నవించారు. కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పిపి చౌదరిని హైదరాబాద్ లో ఇంద్రకరణ్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్ని విభాగాల్లో వాటా పంపిణీ జరిగినట్లే న్యాయ  నియామకాల్లో సైతం తమ వాటా ఇవ్వాలని కోరారు. 42శాతం తెలంగాణ వారికి నియామకాల్లో కేటాయించాలని కోరారు. కింది కోర్టులలో న్యాయాధికారుల విభజన జరగలేదని తెలిపారు.

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాప్యం వల్లే హైకోర్టు విభజన ఆలస్యం అవుతుందన్నారు ఐకె రెడ్డి. ఎపి సర్కారు సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్నట్లే హైకోర్టు భవనం కూడా కట్టుకుంటే హైకోర్టు విభజన సులభంగా అవుతుందన్నారు. 

 

విభజన చట్టం ప్రకారం న్యాయాధికారుల విభజన జరగాలన్నారు.

 

నియామకాల్లో  42% రేషియో పాటించాలన్నారు.

 

జిల్లాలో కొత్త కోర్టుల భవనాలకు నిధులు కేటాహించాలని కోరాను..

 

హైకోర్టు విభజన ఫై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

 

PREV
click me!

Recommended Stories

Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu
Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ