Telangana Elections : కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డిని క‌లిసిన బీసీ నేత‌లు.. టిక్కెట్టు వారికే దక్కేనా?

Published : Sep 27, 2023, 04:37 PM IST
Telangana Elections :  కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్ రెడ్డిని క‌లిసిన బీసీ నేత‌లు.. టిక్కెట్టు వారికే దక్కేనా?

సారాంశం

Hyderabad: తెలంగాణలోని 119 స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 34కు పైగా సీట్లు ఇవ్వాలని వెనుకబడిన తరగతులకు (బీసీ వ‌ర్గం) చెందిన కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. బీసీల‌కు టికెట్ కేటాయింపుల‌పై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ బీసీ నేతలు రాహుల్ సహా ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. తాజాగా ప‌ల‌వురు బీసీ నేత‌లు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.  

Bc leaders meet Congress chief Revanth Reddy: తెలంగాణలోని 119 స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 34కు పైగా సీట్లు ఇవ్వాలని వెనుకబడిన తరగతులకు (బీసీ వ‌ర్గం) చెందిన కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. బీసీల‌కు టికెట్ కేటాయింపుల‌పై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ బీసీ నేతలు రాహుల్ సహా ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. తాజాగా ప‌ల‌వురు బీసీ నేత‌లు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి మహబూబ్‌నగర్‌లో బీసీలకే టిక్కెట్ ఇవ్వాల‌ని కోరారు.

వివ‌రాల్లోకెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ బీసీ నేతలకే ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ బీసీ నాయకులు ఎన్పీ వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్యాదవ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా మొత్తం జనాభాలో బీసీలు 60 శాతం ఉన్నందున అసెంబ్లీ టికెట్ బీసీ నేతకు మాత్రమే ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడికి విన్నవించారు.

దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్.. ఆ ప్రాంతానికి చెందిన బీసీ నేతకే మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చేందుకు నూటికి నూరు శాతం కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ ను కలిసిన వారిలో టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఫహీం, మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఫహీం, ఫయాజ్ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన కాంగ్రెస్ నాయకుల్లో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్ తదితరులు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!