పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలను ఏపీ పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆరోపించింది. ఈ విషయమై సీడబ్ల్యూసీ చైర్మెన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్.
హైదరాబాద్:పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు ఏపీ పట్టించుకోవడం లేదని కేంద్ర జలసంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యుసీ చైర్మెన్ కు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు.పోలవరం బ్యాక్ వాటర్ వల్ల 954 ఎకరాలు ముంపునకు గురౌతున్నాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో గతంలో ఒప్పుకున్న ఏ అంశంలో కూడ ఏపీ ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు తీసుకోవడం లేదని ఈఎన్‌సీ మురళీధర్ ఆరోపించారు. 9 అంశాల్లో ఏ ఒక్కదానిపై కూడ ఏపీ చర్యలు తీసుకోలేదని ఆ లేఖలో గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుండి సమన్వయలోపం ఉందని లేఖలో పేర్కొన్నారు మురళీధర్.
సుప్రీంకోర్టులో కేంద్రం నివేదించినట్టుగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదన్నారు. సీడబ్ల్యూసీ, పీపీఏ బేటీల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేఖలో కోరారు మురళీధర్.తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని కోరారు మురళీధర్.