హజీపూర్: బాలికలను పాతిపెట్టిన బావిలో కుటుంబ సభ్యుల దీక్ష

Published : May 18, 2019, 01:48 PM IST
హజీపూర్: బాలికలను పాతిపెట్టిన బావిలో కుటుంబ సభ్యుల దీక్ష

సారాంశం

బాలికలను పాతిపెట్టిన బావిలోకి దిగి అందులో దీక్ష చేస్తున్నారు. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. యాదాద్రి  జిల్లాలోని హాజీపూర్‌లో వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించాలని గ్రామవాసులు రెండో రోజుల క్రితం దీక్షకు కూర్చున్నారు.

యాదాద్రి: ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, వారిని హత్య చేసిన సంఘటనపై హజీపూర్ అట్టుడుకుతోంది. నిందితుడు శ్రీనివాస రెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శనివారంనాడు మృత్యువాత పడిన ముగ్గురు బాలికల కుటుంబ సభ్యులు అనూహ్యమైన ఆందోళనకు దిగారు.

బాలికలను పాతిపెట్టిన బావిలోకి దిగి అందులో దీక్ష చేస్తున్నారు. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. యాదాద్రి  జిల్లాలోని హాజీపూర్‌లో వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించాలని గ్రామవాసులు రెండో రోజుల క్రితం దీక్షకు కూర్చున్నారు. రాత్రి దీక్షా స్థలం వద్ద దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు. అయితే అర్థరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు.
 
దీక్ష చేస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకుని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హాజీపూర్ వరుస హత్యలపై ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల కిందట బాధితులు గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు