శృంగేరీ మఠంలో... రూ.18లక్షల విలువైన బంగారం చోరీ

By telugu teamFirst Published May 18, 2019, 12:35 PM IST
Highlights

హైదరాబాద్  నగరంలోని నల్లకుంట శృంగేరీ మఠంలో బంగారం  చోరీ జరిగింది. మఠంలోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

హైదరాబాద్  నగరంలోని నల్లకుంట శృంగేరీ మఠంలో బంగారం  చోరీ జరిగింది. మఠంలోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.   ఏకంగా రూ.18 లక్షల విలువైన నగలుమాయమయ్యాయి. భక్తులు సమర్పంచిన కానుకలు భద్రపరిచిన గది నుంచి ఈ నగలు చోరీకి గురయ్యాయి. దీంతో శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

నగలు మాయం ఘటనలో క్లర్క్‌స్థాయి ఉద్యోగులు శ్రీనివాస్, సాయిలను విధుల నుంచి తొలగించారు. పీఠాధిపతి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్, సాయి అనే ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

click me!