ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొట్టి చిన్నారి మృతి

Published : May 18, 2019, 12:25 PM IST
ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొట్టి చిన్నారి మృతి

సారాంశం

కాంగ్రెసు శాసనసభ్యురాలు సీతక్క వాహనం ఢీకొని ఓ చిన్నారి మరణించడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ములుగు: కాంగ్రెసు శాసనసభ్యురాలు సీతక్క వాహనం ఢీకొని ఓ చిన్నారి మరణించింది. మృతురాలు మూడేళ్ల చిన్నారి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదం జరిగిన వెంటనే సీతక్క స్పందించారు. వాహనం దిగి అక్కడే ఉండి గాయపడినవారిని వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి తల్లిదండ్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

సీతక్క కారు బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బైక్ దాదాపుగా నుజ్జు నుజ్జు అయింది. సీతక్క కారు ముందు భాగం ధ్వంసమైంది.

PREV
click me!

Recommended Stories

సిద్ధిపేట‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 544 కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు
సిద్ధిపేట‌లో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌.. ప్ర‌తీ కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌లు