రాజేంద్రనగర్ చోరీ: ప్రియుడి కోసం ఇంటికే కన్నం వేసిన యువతి

Published : Aug 07, 2018, 10:32 AM IST
రాజేంద్రనగర్ చోరీ: ప్రియుడి కోసం ఇంటికే కన్నం వేసిన యువతి

సారాంశం

హైదరాబాదులోని రాజేంద్రనగర్ చోరీ కేసు మిస్టరీ వీడింది. ప్రియుడి కోసం తన ఇంట్లోనే యువతి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్రనగర్ చోరీ కేసు మిస్టరీ వీడింది. ప్రియుడి కోసం తన ఇంట్లోనే యువతి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. యజమాని కూతురు ప్రియుడితో కలిసి మరో వ్యక్తి సాయంతో ఇంట్లోని 22 లక్షల రూపాయలు దొంగిలించినట్లు తేలింది. 

చోరీకి పాల్పడిన ఇంటి యజమాని కూతురు తస్కిం, ఆమె ప్రియుడు అష్రఫ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో యువకుడిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. 

రాజేంద్రనగర్ లోని ఓ ఇంట్లో ఈ నెల 3వ తేదీన దొంగతనం జరిగింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసు మిస్టరీని విడదీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఓ యువకుడు బైక్ పై వచ్చాడని ఓ పిల్లాడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.

ఇంట్లోని రూ.22 లక్షల రూపాయలు తీసుకుని యువతి ప్రియుడు అష్రఫ్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా వ్యాపారం చేసి నిలదొక్కుకుంటే తండ్రి తమ ప్రేమ వివాహానికి అంగీకరిస్తాడనే ఉద్దేశంతో తస్కిం అందుకు పూనుకుంది.

డబ్బులు తీసుకుని అష్రఫ్ బెంగళూరు వెళ్లాడు. బెంగళూరు నుంచి పోలీసులు ఆ యువకుడిని పట్టుకొచ్చారు. రూ.12.5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌