రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: కేసీఆర్‌కు నితీష్ ఫోన్

First Published Aug 7, 2018, 10:31 AM IST
Highlights

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వాలని  బీహార్ సీఎం నితీష్ కుమార్  తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు.


హైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వాలని  బీహార్ సీఎం నితీష్ కుమార్  తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు.

ఈ నెల 9వ, తేదీన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక జరగనుంది.  ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధిగా  హరివంశ్ నారాయణసింగ్‌ను  జెడి (యూ) బరిలోకి దింపనుంది. దీంతో తమ అభ్యర్ధికి మద్దతివ్వాలని  జెడీ(యూ) అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ మంగళవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు  ఫోన్ చేశారు.

అయితే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక విషయంలో  అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని సీఎం కేసీఆర్ నితీష్ కుమార్ వెల్లడించినట్టు సమాచారం.

అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో  ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్ధులకు  టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. అయితే  రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల విషయంలో  కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది  ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక విషయంలో కూడ ఎన్డీఏ అభ్యర్ధికే టీఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయమై  పార్టీ నిర్ణయాన్ని మంగళవారం సాయంత్రానికి వెల్లడించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

click me!