ఫలించిన మౌనపోరాటం.. పెళ్లికి అంగీకరించిన పెద్దలు...

Bukka Sumabala   | Asianet News
Published : Oct 07, 2020, 10:44 AM IST
ఫలించిన మౌనపోరాటం.. పెళ్లికి అంగీకరించిన పెద్దలు...

సారాంశం

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట మౌనపోరాటంతో తమ ప్రేమను గెలిపించుకున్నారు. ప్రేమించిన యువకుడితే పెళ్లాడతానని ఓ అమ్మాయి గత నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తున్న అమ్మాయి చివరికి విజయం సాధించింది. 

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట మౌనపోరాటంతో తమ ప్రేమను గెలిపించుకున్నారు. ప్రేమించిన యువకుడితే పెళ్లాడతానని ఓ అమ్మాయి గత నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తున్న అమ్మాయి చివరికి విజయం సాధించింది. 

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నాలుగు రోజులుగా లలిత అనే యువతి మౌన పోరాటం చేస్తోంది. జన్నారం పట్టణానికి చెందిన లలిత, వెంకట్రావుపేటకు చెందిన అరుణ్‌ ప్రేమించుకున్నారు. ఇరువురి ఇండ్లలో ఈ విషయం తెలిసింది. లలిత ఇంట్లో పెళ్లికి అంగీకరించగా, అరుణ్ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.

దీంతో ప్రేమించిన తరువాత తను వేరొకరిని పెళ్లి చేసుకోనంటూ లలిత, ఆమె కుటుంబసభ్యలు అరుణ్ ఇంటి ముందు మౌనపోరాటానికి దిగారు. నాలుగు రోజులు గడుస్తున్నా అరుణ్ కుటుంబసభ్యలు స్పందించకపోవడంతో మంగళవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేశారు. 

దీంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అడ్డుకొని శాంతింపజేశారు. యువకుడిని రప్పించి స్థానిక పెద్దమ్మ గుడి వద్ద రెండు కుటుంబాల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు మాట్లాడి యువకుడి కుటుంబసభ్యులను వివాహానికి ఒప్పించారు. అనంతరం ఇద్దరికి నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం జరిపిస్తామని హామీ ఇవ్వడంతో యువతి కుటుంసభ్యులు శాంతించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?