
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మందుబాబుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా వీరి కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (moinabad) సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై (hyderabad bijapur highway) శనివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్ సమీపంలోని తాజ్ హోటల్ వద్ద అర్ధరాత్రి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు .. కనకమామిడి వైపు వెళ్తున్న ఓ స్కూటీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక (16), సౌమ్య, అక్షయ కిందపడిపోయారు.
ప్రేమిక అనే అమ్మాయి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ఇద్దరికి కూడా గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమిక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మద్యం సేవించి కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
Also Read:హైదరాబాద్‌లో మరో ఇద్దరిని బలికొన్న మందుబాబులు.. నార్సింగిలో జరిగిన ప్రమాదంలో దంపతుల మృతి..
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో (Hyderabad) మందుబాబులు (Drunk people) బీభత్సం సృష్టించారు. మందుబాబుల వల్ల జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నార్సింగ్ ఎంజీఐటీ వద్ద.. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతులు మృతిచెందారు.