దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ (omicron) తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన బాధితుల సంఖ్య 44కి చేరింది
దక్షిణాఫ్రికాలో (south africa) వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ (omicron) తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన బాధితుల సంఖ్య 44కి చేరింది. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 248 మంది శంషాబాద్ విమానాశ్రయానికి (shamshabad airport) చేరుకున్నారు.
వారందరికీ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయగా ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వీరిలో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దీంతో తెలంగాణలో (telangana) ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 44కి చేరింది. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 11,493 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
undefined
Also Read:భారత్‌లో పిల్లలకు ఏ వ్యాక్సిన్ వేస్తారు?.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?.. ఇక్కడ తెలుసుకోండి
మరోవైపు ప్రపంచ దేశాలను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌నూ కలవర పెడుతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 130 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ఇతర రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియెంట్ విస్తరిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి.
ఇదిలాఉంటే.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,987 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ మహమ్మారికి 162 మంది బలయ్యారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,79,682 మంది కరోనాతో మరణించారు. అలాగే.. ప్రస్తుతం కరోనా రికవరీ సంఖ్య రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది. కాగా.. గడిచిన 24 గంటల్లో 7,091 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 3,42,30,354 కు చేరింది.