సికింద్రాబాద్‌లో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యం.. సిద్ధిపేట ట్రేస్ చేసిన పోలీసులు

Siva Kodati |  
Published : Dec 23, 2022, 07:19 PM IST
సికింద్రాబాద్‌లో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యం.. సిద్ధిపేట ట్రేస్ చేసిన పోలీసులు

సారాంశం

సికింద్రాబాద్‌లో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. సిద్ధిపేట సమీపంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిన్నారిని విడిపించారు. 

సికింద్రాబాద్‌లో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. మధ్యాహ్నం సమయంలో పాపను కిడ్నాప్ చేసిన ఓ యువకుడు ఆమెను సిద్ధిపేట వైపుకు తీసుకెళ్లాడు. సిద్ధిపేట సమీపంలో అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు. కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లో చిన్నారిని రక్షించారు. కాసేపట్లో ఆమెను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. 

కాగా.. మహంకాళీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బాధిత చిన్నారి అమ్మమ్మ ఇంటి నుంచి ఆడుకుంటూ బయటకు వచ్చింది. ఎంతసేపటికి పాప తిరిగి రాకపోవడంతో.. తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లో పాప ఓ వ్యక్తితో వెళ్లినట్లు కనిపించడంతో అప్రమత్తమయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?