యువకున్ని రెచ్చగొడుతూ అశ్లీల వీడియో కాల్స్... చివరకు ఈ కిలేడీ ఏం చేసిందో తెలుసా?

Arun Kumar P   | Asianet News
Published : Aug 09, 2021, 11:52 AM IST
యువకున్ని రెచ్చగొడుతూ అశ్లీల వీడియో కాల్స్... చివరకు ఈ కిలేడీ ఏం చేసిందో తెలుసా?

సారాంశం

సోషల్ మీడియాలో పరిచయం ఓ యువకున్ని నిలువునా ముంచింది. యువతి చేతిలో బ్లాక్ మెయిల్ కు గురయిన హైదరాబాద్ యువకుడు వేలల్లో డబ్బులు సమర్పించుకున్నాడు. 

హైదరాబాద్: సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిచయం పెంచుకుంటుంది. వలపు వల విసిరి అశ్లీల వీడియోలు, ఫోటోలతో రెచ్చగొడుతుంది. మనం ఈ కిలేడి ట్రాప్ లో పడ్డామో ఇక అంతే సంగతి. తనతో జరిపిన చాటింగ్ ను బయటపెడతానని బెదిరించి అందినకాడికి డబ్బులు దండుకుంటుంది. ఇలా ఈ మాయలేడి చేతిలో మోసపోయిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె మోసాల చిట్టా బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారులోని కొంపల్లి సినీ ప్లానెట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఇటీవల ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అటువైపు మహిళ కావడంతో పరిచయం పెంచుకున్న యువకుడు కొంతకాలం వాట్సాప్ చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఫేస్ బుక్ లో ప్రెండ్స్ గా మారిన వీరిద్దరూ అక్కడ కూడా వ్యక్తిగత ఫోటోలు, అశ్లీల వీడియోలతో ఛాటింగ్ సాగించారు.  యువతి వలపు వల విసిరి రెచ్చగొట్టడంతో సదరు యువకుడు కూడా రెచ్చిపోయి తన వ్యక్తిగత ఫోటోలను పంపాడు. అంతేకాదు ఇద్దరి మధ్య అశ్లీల వీడియో కాల్స్ కూడా జరిగాయి. 

read more  రియల్టర్ విజయ్ భాస్కర్ హత్య కేసులో ట్విస్ట్: బాబాతో పాటు మాజీ ఎమ్మెల్యే పాత్ర?

అయితే అతడి వీడియో కాల్స్ రికార్డ్స్, అశ్లీల ఫోటోలను సంపాదించిన తర్వాత యువతి తన అసలురూపాన్ని బటపెట్టింది. వీటిని సోషల్ మీడియలో షేర్ చేస్తానని...కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించి యువకుడి నుండి రూ.23,500 దోచుకుంది. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో పరిచయాలతో జాగ్రత్తగా వుండాలని... తెలిసిన వారు అయితేనే స్పందించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా మోసగాళ్ల వలలో పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని... ఇలాంటి బాధితులు ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu