చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుల్లో ఒకరు ఆత్మహత్య..!

Published : Apr 07, 2021, 12:20 PM IST
చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుల్లో ఒకరు ఆత్మహత్య..!

సారాంశం

చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఈ ఘటన జరిగింది. యువతిపై ఆమె అన్నతోపాటు, పెద్దమ్మ కొడుకు అజయ్ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. 

చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఈ ఘటన జరిగింది. యువతిపై ఆమె అన్నతోపాటు, పెద్దమ్మ కొడుకు అజయ్ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. 

ఈ క్రమంలో బాధితురాలు కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయడంతో భయాందోళనకు గురైన అజయ్ బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

తెలంగాణలోని కొత్తగూడెంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. చిన్ననాటి నుంచే తన అన్నయ్ల్యలు తనను శారీరకంగా లోబరుచుకున్నారని 20 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై చిన్నప్పటి నుంచి శారీరకంగా వాడుకుంటూ బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారని, తల్లికి చెప్తే అసభ్యకరంగా మాట్లాడుతోందని ఆ యువతి తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. పెద్దమ్మ, పెద్దనాన్నలకు చెప్తే ఇదంతా మామూలేనని అంటున్నారని ఆమె చెప్పింది. మెడిసిన్ చదవాలని అనుకుంటున్న తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆ యువతి ఆరోపిచింది. 

ఆ ఫిర్యాదులు చేస్తూ యుతి మంగళవారంనాడు కొత్తగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యువతి చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసిపోయాడు. దాంతో కుటుంబాన్ని తల్లి పోషించాల్సి వచ్చింది. యువతి చిన్నతనంలో కుటుంబం మణుగూరులో ఉండేది.

యువతి 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి, 2009 నుంచి సొంత అన్నయ్య ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. కొన్నేళ్ల క్రితం ఉద్యోగం రావడంతో అతను కొత్తగూడెం వచ్చాడు. ఆమె పెరిగి పెద్దదైనా అలాగే వ్యవహరిస్తూ వస్తున్నాడు. అతడిని భరించలేక ఇంటర్ చదివే సమయంలో పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ వరసకు అన్నయ్య అయిన పెద్దమ్మ కుమారుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. పెద్దమ్మకు, పెద్దనాన్నకు, తల్లికి చెప్పినా పట్టించుకోలేదు. 

మెడిసిన్ ప్రవేశపరీక్ష శిక్షణ కోసం ఇటీవల ఆమె వేరే ప్రాంతానికి వెళ్లింది. అయితే, లాక్ డౌన్ కారణంగా ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పుడు అన్నయ్య ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో కొన్ని రోజుల వరకు వారికి దూరంగా ఉండి మళ్లీ సెలవులు ఇవ్వడంతో కొత్తగూడెం వచ్చింది. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు అన్నయ్యల నుంచి మాత్రమే కాకుండా తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్నల నుంచి ప్రాణహానీ ఉందని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu