తెలంగాణ కరోన్ అప్ డేట్: తాజాగా 1914 పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Apr 07, 2021, 10:26 AM IST
తెలంగాణ కరోన్ అప్ డేట్: తాజాగా 1914 పాజిటివ్ కేసులు

సారాంశం

సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 74,274మందికి కరోనా టెస్టులు చేయగా 1914మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 74,274మందికి కరోనా టెస్టులు చేయగా 1914మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కు చేరితే టెస్టుల సంఖ్య 1,05,72,621కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 285మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,03,298కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,617యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 6,634గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1734కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.1శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.78శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 17, నాగర్ కర్నూల్ 18, జోగులాంబ గద్వాల 12,  కామారెడ్డి 64, ఆదిలాబాద్ 29, భూపాలపల్లి 5, జనగామ 13, జగిత్యాల 68, అసిఫాబాద్ 21, మహబూబ్ నగర్ 36, మహబూబాబాద్ 9, మెదక్ 23, నిర్మల్ 104, నిజామాబాద్ 179,  సిరిసిల్ల 32, వికారాబాద్ 25, వరంగల్ రూరల్ 9,  ములుగు 6, పెద్దపల్లి 23, సిద్దిపేట 42, సూర్యాపేట 31, భువనగిరి 25, మంచిర్యాల 37, నల్గొండ 40 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 393కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 205, రంగారెడ్డి 169, కొత్తగూడెం 7, కరీంనగర్ 80, ఖమ్మం 48, సంగారెడ్డి 76, వరంగల్ అర్బన్ 60కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:  

 

PREV
click me!

Recommended Stories

యాద‌గిరిగుట్ట‌, స్వర్ణగిరి ఒక్క రోజులో చుట్టేసి వచ్చే టూర్ ప్లాన్.. తక్కువ ఖర్చుతోనే ప్యాకేజీ
కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions