
ఎల్లుండి ఖమ్మంలో వైయస్ షర్మిల సంకల్ప సభ ఏర్పాటు చేయనున్నారు. సంకల్ప సభలో షర్మిల పార్టీ ప్రకటన చేయనున్నారు. షర్మిల సభకు ముఖ్య అతిథిగా వైఎస్ విజయలక్ష్మి హాజరుకానున్నారు.
లోటస్ పాండ్ నుంచి వెయ్యి కార్లతో ఖమ్మంకు ర్యాలీగా బయలుదేరనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే సభ జరుపుతామని షర్మిల టీమ్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల గూటికి చేరుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మహిళా కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు అచ్యుత యాదవ్ పార్టీ పదవికి రాజీనామా చేసి షర్మిలకు మద్దతు పలికారు.
ఈ మేరకు సోమవారం ఆమె లోటస్ పాండ్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే కరీంనగర్ మంథనికి చెందిన ఒకరు, నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఆరుగురు మాజీ సర్పంచ్‌లు, పలువురు న్యాయవాదులు షర్మిలను కలిసి మద్దతు మద్దతు తెలిపినట్లు వెల్లడించింది.