తెలంగాణలో కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పెరిగాయంటే..!

Published : Mar 29, 2021, 11:48 AM ISTUpdated : Mar 29, 2021, 11:56 AM IST
తెలంగాణలో కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పెరిగాయంటే..!

సారాంశం

మరో వైపు కోవిడ్ తో  చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1690కి చేరింది.


తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే.. నిన్న ఒక్కరోజు మాత్రం కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయనే చెప్పాలి. గడిచిన 24గంటల్లో 33,930 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకముందు రోజు 535 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నిన్న కాస్త తగ్గాయనే చెప్పాలి.

తాజా కేసులతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. మరో వైపు కోవిడ్ తో  చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1690కి చేరింది.

తాజాగా 313 మంది కోవిడ్ ను జయించగా... ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,00,469కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,583 క్రియాశీల కేసులు ఉండగా.. వీరిలో 1,815మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 146 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,00,53,026 కరోనా పరీక్షలు నిర్వహించారు.

రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా నిన్న 9, 962 మందికి డోస్-1, 5మందికి డోస్-2 టీకా వేశారు. ఇప్పటి వరకు 9,38,658మందికి డోస్-1, 2,34,508మందికి డోస్-2 కరోనా టీకా వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Medaram Visit:మేడారంలో రేవంత్ రెడ్డి గిరిజనదేవతలకు ప్రత్యేకపూజలు | Asianet News Telugu
సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో CM Revanth Reddy Power Full Speech | CPI Celebrations | Asianet News Telugu