
హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌లో (jubilee hills) ఫుట్‌పాత్‌ను ఆక్రమించారంటూ బీజేపీ (bjp) ఎంపీ సీఎం రమేశ్ (cm ramesh) అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు. అయితే దీనిని సీఎం రమేశ్ ఇంటి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 66లో ఈ ఘటన జరిగింది. అయితే పోలీసుల భద్రత మధ్య జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.