కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది.. వచ్చే నాలుగు వారాలు కీలకం.. వారికి సెలవులు రద్దు: డీహెచ్ శ్రీనివాసరావు

By Sumanth KanukulaFirst Published Jan 6, 2022, 2:53 PM IST
Highlights

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్నాయని.. వచ్చే నాలుగు వారాలు కీలకమని డీహెచ్ శ్రీనివాసరావు (DH Srinivasa Rao) తెలిపారు. వైద్యారోగ్య శాఖ సూచనలు ప్రజలంతా పాటించాలని కోరారు. కేసులు పెరుగుతుందన్నదున ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. 

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్నాయని.. వచ్చే నాలుగు వారాలు కీలకమని డీహెచ్ శ్రీనివాసరావు (DH Srinivasa Rao) తెలిపారు. వైద్యారోగ్య శాఖ సూచనలు ప్రజలంతా పాటించాలని కోరారు. కేసులు పెరుగుతుందన్నదున ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రభుత్వమే అన్ని చేస్తుందని భావించకూడదని చెప్పారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీలు వారి కార్యక్రమాలను నియంత్రించుకోవాలి చెప్పారు. పిల్లలకు సెలవులు ఇచ్చామని.. అయితే సెలవుల్లో పిల్లలు బయటకు వెళ్లవద్దని, బయటకు వెళితే కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. 

Omicron కమ్యూనిటీలోకి వచ్చేసిందని డీహెచ్ అన్నారు. ఇకపై ఒమిక్రాన్ కేసులను కరోనా బులిటెన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించమని చెప్పారు. కొత్త కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్‌వే అనుకోవచ్చని ఆయన అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని చెప్పారు. ఢిల్లీలో ఒక్క రోజే 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి కేసులు పెరుగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గత 5 రోజుల్లో 4 రెట్లకు పైగా కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని చెప్పారు. కరోనా పాజిటివిటీ రేటు కూడా 3 శాతానాకి పైగానే ఉందని వెల్లడించారు. 

కేసులు వేలాదిగా నమోదవుతున్న తీవ్ర ప్రభావం లేదని Srinivasa Rao అన్నారు. Omicron Variant  సోకినవారు 5 రోజుల్లోనే కోలుకుంటున్నారని.. కేవలం 10 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నాయని అన్నారు. అయితే డేల్టా వేరియంట్ (delta variant) పూర్తిగా తొలగిపోలేదని డీహెచ్ హెచ్చరించారు. డేల్టా వేరియంట్ సోకితే 3 రోజుల తర్వాత లక్షణాలు తీవ్రమవుతాయని గుర్తుచేశారు. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని చెప్పారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు భయంతో ఆస్పత్రులలో చేరడం సరైంది కాదని అన్నారు. . భవిష్యత్తులో 90 శాతం కేసులు ఒమిక్రాన్‌తోనే ఉండబోతున్నాయని చెప్పారు. 

ఆరోగ్య పరంగా తీవ్ర సమస్యలు ఉంటేనే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మిషన్ ప్రోటోకాల్ పాటిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్‌ను పాటించాలని.. అవసరమైన వారినే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రలులు అనవసరంగా చికిత్స చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా సొంత వైద్యం చేసుకోవదు.. వైద్యులను సంప్రదించాలని సూచించారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు చాలా కీలకం కానున్నాయని డీహెచ్ తెలిపారు. ఫిబ్రవరి మధ్యకి కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ సూచనలు ప్రజలంతా పాటించాలని కోరారు. తప్పనిసరిగా ఇంట్లో, బయట మాస్క్‌ ధరించాలని.. భౌతికదూరం పాటించాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. గాలి బాగా తగిలే ప్రదేశాలలో ఉండాలని సూచించారు. 

వ్యాధి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. తక్కువ లక్షణాలు ఉన్నవారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మూడో దశను ఎదుర్కొవడానికి పూర్తిగా సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు వచ్చే నాలుగు వారాలు సెలవులు రద్దు చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కోవిడ్ పరీక్షల కోసం.. 2 కోట్ల పరీక్ష కిట్లను సిద్దంగా ఉంచామని తెలిపారు. కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్దంగా ఉంచామని చెప్పారు. హోం ఐసోలేషన్ కిట్‌లో తొమ్మిది రకాల మందులు ఉంటాయని తెలిపారు.  

సంక్రాంతికి కరోనా కేసులు మరింతగా పెరుగుతాయని అన్నారు. కోవిడ్‌కు సంబంధించి ఆంక్షలపై ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. రాష్ట్రంలో 101.90 శాతం తొలి డోసు.. 71 శాతం మందికి రెండు డోసులు పూర్తి అయినట్టుగా తెలిపారు. జనవరి 26 నాటికి రెండో డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకన్నట్టుగా చెప్పారు. 15 నుంచి 18 ఏళ్ల వారిలో 10 శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా తెలిపారు. విద్యార్థుల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించామని తెలిపారు. నిబంధనలు పాటిస్తే మూడోదశ నుంచి త్వరగా బయటపడగలం అని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 

click me!