వనమా రాఘవను అరెస్ట్ చేయకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ప్రభుత్వానికి భట్టి అల్టీమేటం

Siva Kodati |  
Published : Jan 06, 2022, 02:45 PM ISTUpdated : Jan 06, 2022, 02:48 PM IST
వనమా రాఘవను అరెస్ట్ చేయకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ప్రభుత్వానికి భట్టి అల్టీమేటం

సారాంశం

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర హస్తం వున్నట్లుగా వార్తలు వస్తుండటంతో రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Mallu bhatti vikramarka) స్పందించారు. 

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర హస్తం వున్నట్లుగా వార్తలు వస్తుండటంతో రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Mallu bhatti vikramarka) స్పందించారు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన అందరినీ కలచివేసిందని విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణ తన ఆవేదనను సెల్ఫీ వీడియో వివరించాడని అన్నారు. వనమా రాఘవపై ముందే చర్యలు తీసుకుని వుండుంటే ఇవాళ ఇంత బాధతో వుండేవాళ్లం కాదన్నారు భట్టి. 

ఈ దారుణానికి కారణమైన వనమా రాఘవను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. ప్రజల  ధన, మాన ప్రాణాలను కాపాడేందుకు పెట్టిన వ్యవస్థలు ఈ విషయంలో విఫలమవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. గతంలోనే ఓ వ్యక్తి వనమా రాఘవ పేరు రాసిపెట్టి చనిపోయాడని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఈ ఘటన జరిగిన మరుసటి  రోజే కొత్తగూడెం ఆసుపత్రికి వెళ్లానని.. ఆమె పరిస్ధితి చూసి తట్టుకోలేకపోయానని అన్నారు. వనమా కొడుకుని తక్షణం అరెస్ట్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తానని విక్రమార్క హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని , దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Also Read:నా కొడుకు రాఘవను పోలీసులకు అప్పగిస్తా: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ

మరోవైపు తన కొడుకు రాఘవపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని  కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama Venkateshwara rao ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రజలకు బహిరంగ లేఖ రాశాడు. ఈ నెల 3 వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన Ramakrishna కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తన suicide కు వనమా రాఘవేందర్ రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు ప్రకటించారు. ఈ మేరకు selfie వీడియోను తీశాడు.ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. 

ఈ విషయమై  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. బహిరంగ లేఖ రాశారు. తన కొడుకు  vanama Raghavendra raoను పోలీసులకు అప్పగిస్తానని వనమా వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. పోలీసులకు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కోరారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా నా కొడుకుని అప్పగిస్తానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు చెప్పారు.రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన తర్వాత వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu