మేయర్‌గా పవర్.. ఎమ్మార్వో బదిలీ: ప్రతీకారం తీర్చుకున్న గద్వాల్ విజయలక్ష్మీ

Siva Kodati |  
Published : Feb 13, 2021, 08:29 PM ISTUpdated : Feb 13, 2021, 08:30 PM IST
మేయర్‌గా పవర్.. ఎమ్మార్వో బదిలీ: ప్రతీకారం తీర్చుకున్న గద్వాల్ విజయలక్ష్మీ

సారాంశం

హైదరాబాద్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గద్వాల్ విజయలక్ష్మీ ప్రతీకారం తీర్చుకున్నారు. షేక్‌పేట్ ఎమ్మార్వోను సీసీఎల్‌కు బదిలీ చేయించారు మేయర్. కార్పోరేటర్‌గా వున్నప్పుడు విజయలక్ష్మీపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో

హైదరాబాద్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గద్వాల్ విజయలక్ష్మీ ప్రతీకారం తీర్చుకున్నారు. షేక్‌పేట్ ఎమ్మార్వోను సీసీఎల్‌కు బదిలీ చేయించారు మేయర్.

కార్పోరేటర్‌గా వున్నప్పుడు విజయలక్ష్మీపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో. కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని.. గతంలో షేక్ పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిపై విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో నాడు కార్పోరేటర్‌గా వున్న విజయలక్ష్మీపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు శ్రీనివాస్ రెడ్డి. మేయర్‌గా అధికారంలోకి రాగానే ఎమ్మార్వో  శ్రీనివాస్ రెడ్డిపై బదిలీ వేటు వేయించారు విజయలక్ష్మీ. 

Also Read:అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రస్థానం

విజయలక్ష్మికి మేయర్ పదవి దక్కడానికి ప్రధాన కారణం కేశవరావు పట్ల కేసీఆర్‌కు ఉన్న నమ్మకమే. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన కేకేకు కేసీఆర్ అమిత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన్ను పార్టీ సెక్రటరీ జనరల్‌గా నియమించడంతోపాటు.. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత 2014, 2020ల్లో తిరిగి రాజ్యసభకు పంపారు.

కేకే కుమారుడు విప్లవ్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలం ముగియడంతో.. తదుపరి ఉత్తర్వులు ముగిసే వరకు చైర్మన్‌గా కొనసాగేలా ప్రభుత్వం జీవో ఇచ్చింది

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu