ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం.. దగ్గరుండి పర్యవేక్షించిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ (వీడియో)

By Siva Kodati  |  First Published Sep 28, 2023, 3:46 PM IST

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ఆ సందర్భంగా నిమజ్జనాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. అధికారులు, నగర ప్రజలకు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. 


ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ఎప్పుడూ లేనంత తొందరగా ఈ యేడు  ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. దీనికోసం ఉదయం 5గంటలకే  ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం సన్నాహాలు ఏర్పాటు చేశారు. దీంతో.. బై బై గణేశా అనే నినాదాలతో ఎన్టీఆర్ మార్గ్ మారుమోగిపోయింది. ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నెం.4 దగ్గర వినాయకుడి నిమజ్జనం జరిగింది. వినాయకుడిని చివరిసారిగా చూడడానికి క్రేన్ నెం.4 దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం పొగయ్యారు.

63 అడుగుల ఎత్తైన విగ్రహం ఎట్టకేలకు అనుకున్న సమయానికే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిమజ్జనం పూర్తయింది. ప్రతీసారి రాజధానిలోని అన్ని విగ్రహాలు అయిన తరువాత ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగేది. కానీ ఈ సారి మహాగణపతి నిమజ్జనం తరువాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని ప్రకటించారు.

Latest Videos

undefined

ఇకపోతే.. ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనుకున్న టైమ్‌కి ఖైరతాబాద్ గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేశామన్నారు. సరిగ్గా 1.30 గంటలకు గణనాథుని నిమజ్జనం పూర్తి చేశామని మేయర్ తెలిపారు. హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ , జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ , సిబ్బంది,  నగర సీపీ ఆనంద్ , డీఆర్ఎఫ్ చీఫ్ ప్రకాష్ రెడ్డి, విద్యుత్, తాగునీరు, పర్యాటక శాఖ , ఖైరతాబాద్ గణేష్ కమిటీ, అధికారులు, ప్రజలకు మేయర్ విజయలక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. 

 

click me!