మేయర్‌ బొంతుకు వైద్య పరీక్షలు: రెండోసారి నెగిటివ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు

Siva Kodati |  
Published : Jun 13, 2020, 07:40 PM IST
మేయర్‌ బొంతుకు వైద్య పరీక్షలు: రెండోసారి నెగిటివ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు

సారాంశం

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. గురువారం మేయర్ డ్రైవర్‌కు పాజిటివ్‌ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా బొంతు రామ్మోహన్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

దీనిలో భాగంగానే ఆయన నుంచి వైద్యులు నమూనాలు తీసుకున్నారు. రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీతో మేయర్ కుటుంబసభ్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:తెలంగాణలో ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా!

కొద్దిరోజుల క్రితం బొంతు రామ్మోహన్‌కు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇటీవల నగరంలోని ఓ టీ దుకాణంలో మేయర్ టీ తాగారు.

అయితే టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో, ముందు జాగ్రత్తగా ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు.

Also Read:తెలంగాణ వైద్య సిబ్బందిపై కరోనా పంజా: 100 దాటిన కేసులు!

కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అనివార్య పరిస్దితిలో సడలింపులు ఇవ్వడం జరిగిందని బొంతు వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.