జర్నలిస్ట్‌ల దీక్షకు వెళ్తుండగా... హౌస్ అరెస్ట్: పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Jun 13, 2020, 3:11 PM IST
Highlights

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరుగుతున్న జర్నలిస్టుల ఉపవాస దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు బయల్దేరిన టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్ మృతికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రతినిధులు ఉపవాస దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరుగుతున్న జర్నలిస్టుల ఉపవాస దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు బయల్దేరిన టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Also Read:పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ కుమార్ ఫ్యామిలీ

దీనిపై స్పందించిన ఆయన.. తాను పార్టీ తరపున గోదావరి జలదీక్షకు వెళ్లటం లేదని, జర్నలిస్టుల దీక్షకు వెళ్తున్నానని, ఎక్కడికీ వెళ్లనీయకపోవటం ఏంటని రేవంత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులంతా మా దగ్గరే డ్యూటీ చేయడం ఎందుకు.. మాకు అదొక్కటే పని కాదుగా, వేరే పనులను చేసుకోనివ్వరా అంటూ ఫైరయ్యారు. తన ఇంటి వద్ద ఇంత సెక్యూరిటీ ఎందుకన్న ఆయన... డీజీపీ ఆఫీసు దగ్గర పెట్టుకోండంటూ పోలీసులపై మండిపడ్డారు.

Also Read:ఈ డిమాండ్లను నెరవేర్చండి: కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవాలి, మీడియా సిబ్బంది కి 50 లక్షల భీమా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాము ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చామని... హౌస్ అరెస్ట్ తప్పదని రేవంత్‌కు పోలీసులు తెలిపారు. 

click me!