గుర్తులు తారుమారు: ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దు

By narsimha lodeFirst Published Dec 1, 2020, 11:08 AM IST
Highlights

సీపీఐ అభ్యర్ధి ఎన్నికల గుర్తు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్ పేట డివిజన్ పోలింగ్ ను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్: సీపీఐ అభ్యర్ధి ఎన్నికల గుర్తు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్ పేట డివిజన్ పోలింగ్ ను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

ఓల్డ్ మలక్ పేట లోని 26వ డివిజన్ లో సీపీఐ అభ్యర్ధి గుర్తు తారుమారైంది. ఈ విషయమై సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. బ్యాలెట్ పత్రంలో సీపీఐ గుర్తు కంకికొడవలికి బదులుగా సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ముద్రించారు.

also read:బల్దియా ఎన్నికల్లో గజిబిజీ.. ఎన్నికల గుర్తులు తారుమారు

ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్ధితి నెలకొందని సీపీఐ నేతలు విమర్శించారు. ఎన్నికల గుర్తు తారుమారు కావడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ కమిషనర్ ను వివరణ కోరింది.

ఎన్నికల గుర్తు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్ పేట డివిజన్ పోలింగ్ ను రద్దు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ మేరకు ఈ స్థానంలో పోలింగ్ ను రద్దు చేశారు.  ఈ స్థానంలో రీ పోలింగ్ ను నిర్వహించనున్నారు.

click me!