చివరికి టెంటు కూడా లేకుండా పోయింది: కేసీఆర్ మీద బండి సంజయ్

By telugu teamFirst Published Nov 19, 2020, 12:54 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో హిందువులను ఉండనిస్తారా, లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవగానే కేసీఆర్ ఆ ఫ్రంటూ ఈ ఫ్రంటూ అన్నారని, చివరికి టెంటు కూడా లేకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లి ఇప్పుడు దుకాణం మొదలు పెట్టారని ఆయన అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు దారుణమని ఆయన గురువార మీడియా సమావేశంలో అన్నారు. దేశ ప్రధానిని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. ప్రపంచంలో భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిని ప్రధానిని విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. ప్రధానిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: 100 స్థానాల్లో గెలుస్తాం, ఏపీని ఎప్పుడో తొక్కేశాం.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్.

కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో హిందువులను ఉండనిస్తారా, లేదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ది నీచమైన చరిత్ర అని ఆయన అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీలు ఇస్తూ విడుదల చేసిన మేనిఫెస్టో తమ వద్ద ఉందని, వాటిలో ఏం చేశారని ఆయన అన్నారు. 

కేసీఆర్ భాషను కేసీఆర్ కే అప్పగిస్తామని బండి సంజయ్ అన్నారు. కేంద్రం సంక్షేమ పథకాలకు నిధులు ఇస్తోందని ఆయన చెప్పారు. ఏయే సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందో ఆయన వివరించారు.  

Also Read: గ్రేటర్ బరిలో జనసేన... విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, పట్టభద్రులతో...

click me!