వరద సాయం నిలిపివేత: కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన బండి సంజయ్

Published : Nov 18, 2020, 06:47 PM ISTUpdated : Nov 18, 2020, 07:33 PM IST
వరద సాయం నిలిపివేత: కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన బండి సంజయ్

సారాంశం

వరద సాయం ఆపేయాలంటూ తాను ఈసీకి లేఖ రాసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తిప్పికొట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన అన్నారు.  

హైదరాబాద్: వరద సాయం నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు చేసిన విమర్శలను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తిప్పికొట్టారు. వరద సాయం ఆపేయాలని తాను ఎన్నికల కమిషన్ కు లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు బిజెపి వల్లనే వరద సాయం ఆగిందని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు 

టీఆర్ఎస్ నేతలే తన సంతకం ఫోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆయన ఆరోపించారు. దానిపై ఉన్నది తన సంతకం కాదని ఆయన స్పష్టం చేశారు. వరద సాయం బిజెపి ఆపించలేదని చెప్పడానికి చార్మినార్ బాగ్యలక్ష్మి అమవారి వద్ద ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు సీఎం కేసీఆర్ ఒట్టు వేయడానికి సిద్ధమేనా అని ఆయన సవాల్ చేశారు 

Also Read: బీజేపీ ఫిర్యాదుతోనే గ్రేటర్‌లో వరద సహాయానికి బ్రేక్‌: కేసీఆర్ ఫైర్.

ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్ పచ్చి అబద్ధాలు అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఏమీ చేయలేని కేసీఆర్ ఇక ఢిల్లీలో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. వరద సాయం ఆపాలని కోరుతూ ఈసీకి బండి సంజయ్ లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.  

Also Read: జీహెచ్ఎంసీలో గెలుపు మనదే: బీజేపీ, కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కారను షెడ్డుకు పంపిస్తామని అంతకు ముందు బండి సంజయ్ అన్నారు. కారును షెడ్డుకు పంపిస్తే సారు..... కారు.. సర్కారు.. ఇక రావడమంటూ జరగదని ఆయన ్న్నారు హైదరాబాదులో ఏం జరగబోతోందో దేశమంతా చూస్తోందని ఆయన అన్నారు సీఎం కేసీఆర్ నియంత పోకడలకు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో తమ పార్టీని ప్రజలు గెలిపించారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాదును మజ్లీస్ కు అప్పగించారని ఆయన విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu