జీహెచ్ఎంసీ ఎన్నికలు: 29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

By Siva KodatiFirst Published Nov 18, 2020, 6:33 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పీసీసీ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలి, ఎలాంటి హామీలు ఇవ్వాలన్న దానిపై పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పీసీసీ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలి, ఎలాంటి హామీలు ఇవ్వాలన్న దానిపై పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్ ముఖ్య నేతలతో పాటు డివిజన్ ఇన్‌ఛార్జ్‌లతో చర్చించారు. వరద బాధితులకు సాయం అందకపోవడంపై, ప్రధానంగా ఫోకస్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇక డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందన్న అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలని చూస్తోంది. వరుసగా అన్ని ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా తీవ్ర ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్.. జీహెచ్ఎంసీ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది.

మరోవైపు ఇవాళ్టీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 20వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు, 21న నామినేషన్ల పరిశీలన, 22 నాటికి నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవాలని ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాలను వడివడిగా విడుదల చేస్తున్నాయి. 

కాంగ్రెస్ జాబితా:
1. కాప్రా - పతి కుమార్
2. ఏఎస్ రావు నగర్ - శీరిషా రెడ్డి
3. ఉప్పల్ - రజిత
4. నాగోల్ - శైలజ
5. మన్సూరాబాద్ - ప్రభాకర్ రెడ్డి
6. హయత్ నగర్ - గుర్రం శ్రీనివాస్ రెడ్డి
7. హస్తినాపురం - సంగీతా నాయక్
8. ఆర్కే పురం - పూర్ణా గణేశ్ నిర్మల
9. గడ్డి అన్నారం - వెంకటేశ్ యాదవ్
10. సులేమాన్ నగర్ - రిజ్వానా బేగం
11. మైలార్‌దేవ్ పల్లి - సనం శ్రీనివాస్ గౌడ్
12. రాజేంద్రనగర్ - బత్తుల దివ్య
13. అత్తాపూర్ - భాస్కర్ గౌడ్
14. కొండాపూర్ - మహిపాల్ యాదవ్
15. మియాపూర్ - ఇలియా షరీఫ్
16. మూసాపేట్ - గోపిశెట్టి రాఘవేందర్
17. ఓల్డ్ బోయిన్‌పల్లి - అమూల్య
18. బాలానగర్ - సత్యశ్రీ
19. కూకట్‌పల్లి - గొట్టిముక్కల విశ్వ తేజేస్వరరావు
20. గాజుల రామారం - కూన శ్రీనివాస్ గౌడ్
21. రంగారెడ్డి నగర్ - గిరి శంకర్
22. సూరారం - వెంకటేశ్
23. జీడిమెట్ల - బండి లలిత
24. నేరేడ్‌మెట్ - చాకో

25. మౌలాలి- ఉమా మహేశ్వరి 
26. మల్కాజ్ గిరి- శ్రీనివాస్ గౌడ్ 
27. గౌతంనగర్- తపస్వాని యాదవ్ 
28. బేగంపేట్- మంజుల రెడ్డి

click me!